బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్‌గా, కానిఫడెంట్‌గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యులో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!
ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్‌లో ప్రచారం.. కంటెస్టెంట్‌పై ఫిర్యాదు
8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..
షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.
కామనర్‌గా బిగ్‌బాస్‌లోకి..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 10లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో షాలిని గేమ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్‌బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.


