కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టి వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆషిక రంగనాథ్. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు తమిళం, తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ప్రస్తుతం సర్ధార్2 సినిమాతో అటు తమిళ ప్రేక్షకులకూ, ఇటు తెలుగు వారికీ పలకరించింది. మరి సినిమా అవకాశాలపై ఆమె మనసులో మాట ఏంటో తెలుసా? ఆమె మాటల్లోనే..
ఇదీ చదవండి: ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘ హీరోయిన్‌గా అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపంచాలనేదే నా కోరిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే.. తన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరవడం ముఖ్యం. అందుకే కథ విన్నప్పుడు పాత్ర ఎలా ఉంటుంది?. ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అని పరిశీలించిన తర్వాతే సినిమాలకు ఓకే చెప్తా.
చిత్ర సీమలో అడుగుపెట్టిన 2నుంచి 3 సంవత్సరాలకే తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు అంత ఐడియా లేదు. ఇవి మంచి ప్రాజెక్ట్‌లా కాదా అని. అందువల్లే కొంచం లేట్ అయింది. 2023లో వచ్చిన అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను.
తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనేదే నా కోరిక. మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే భాషతో సంబంధం లేకుండా నటించేందుకు సిద్ధం. హీరోయిన్ కేవలం అందంతో కాకుండా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలనేదే లక్ష్యం. (బిగ్‌బాస్‌లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..)
సర్దార్2 నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. చాలా మంది హీరోలతో చేసనప్పటికీ కార్తీ సార్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభం. సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం తెరపై కనిపిస్తాయి. తెలుగులో నాకు నచ్చిన చిత్రాల్లో అలా వైకంఠపురం, సీతారామం సినిమాలు ఇష్టం. ఈ చిత్రాల్లో సాంగ్స్ ఇప్పటికీ ఇంట్లో వింటుంటాను.‘ అని ఆషిక గతంలో పలు ఇంటర్వ్యులో తెలిపారు.
ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్


