విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..! | Vijay Deverakonda Call On To All Celebrate Vittana Ganapati in Ganesh Chaturthi | Sakshi
Sakshi News home page

విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!

Sep 10 2026 2:17 PM | Updated on Sep 10 2026 2:19 PM

Vijay Deverakonda Call On To All Celebrate Vittana Ganapati in Ganesh Chaturthi

ఇటీవలే ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్‌ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బాటలో విజయ్‌ దేవరకొండ చేరారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సంస్థ ఆయనకు ఇచ్చిన విత్తన గణపతిని ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలని విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు. ‘నగరం కలుషితం కాకుండా మట్టి లేదా విత్తన గణపతిని పూజిద్దాం. దీంతో మొక్కలు పెరుగుతాయి’ అని విజయ్‌ సూచించారు. 

మొక్కగా ఎదుగుతాయి..
‘కెమెకిల్స్‌తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్‌ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను గతంలో మెగాస్టార్‌ చిరంజీవి వివరించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement