నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. ఈ సినిమా సెప్టెంబరు 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేసి అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.


