ఉత్కంఠను పెంచుతున్న అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం3’ ట్రైలర్‌ | Ajay Devgan Drishyam The Conclusion Trailer Released | Sakshi
Sakshi News home page

Drishyam3 Movie: ఉత్కంఠను పెంచుతున్న అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం3’ ట్రైలర్‌

Sep 9 2026 4:38 PM | Updated on Sep 9 2026 5:03 PM

Ajay Devgan Drishyam The Conclusion Trailer Released

మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు ‘దృశ్యం 3’ రాబోతోంది. మలయాళంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో విడుదలైన ‘దృశ్యం3’ ఈ సారి హిందీలోనూ విడుదలకానుంది.  ఈమేరకు బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌, కీలక పాత్రలో అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వంలో ‘దృశ్యం3’ని తెరకెక్కించారు. టబు,ప్రకాశ్‌ రాజ్‌, శ్రియతో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్‌, చరణ్‌లకు షాక్‌! ఎలిమినేట్‌ అవుతారా?
ఈ చిత్రం గాంధీ జయంతి రోజు(అక్టోబరు 2)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం3’కి పూర్తి భిన్నమైన క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌ను ముగించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకే దృశ్యం: ది కన్‌క్లూజన్‌ అనే టైటిల్‌తో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాలు, ట్విస్టులు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement