టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత ఇటు విజయ్, అటు సందీప్..ఇద్దరు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. సందీప్ అయితే యానిమల్ చిత్రం పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అయినా కూడా ఇద్దరి మధ్య స్నేహ బంధం అలానే కొనసాగుతుంది. ఇటీవల సందీప్ నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి విజయ్ అండగా నిలిచాడు. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని సందీప్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ‘ఎపిక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా వచ్చాడు సందీప్. ఇదే ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు.
ఇలా విజయ్, సందీప్ మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ తన అభిమాన డైరెక్టర్‌కి ఒక ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ ఇచ్చిన వాచ్ ని సందీప్ రెడ్డి వంగ వెంటనే పెట్టుకోవడం చూసి వీళ్ళిద్దరికి ఒకరి ఉంటే ఒకరు ఎంత ఇష్టమో అని ఆ వీడియోని చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.
#VijayDeverakonda gifted a brand new watch to #SandeepReddyVanga !
their bonding ❤️ https://t.co/56uF21Sgey pic.twitter.com/eFcfW46wGc— Rajesh Manne (@rajeshmanne1) September 8, 2026


