టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈరోజు టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


