తమిళ నటి నివేదితా సతీశ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం అయిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం.’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. (మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను)
ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. నివేదితా షేర్ చేసిన ఈ ఫొటోలకు గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
హలో సినిమాతో..
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన హలో (2017) సినిమా ద్వారా నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవితగా కనిపించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024). తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది ఇందులో ఆమె 'తేన్పాసియార్' (యాక్షన్ రోల్) అనే కీలక పాత్రను పోషించారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటించారు. (రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)


