breaking news
mahammad
-
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ నటి.. వరుడు ఎవరో తెలుసా..?
తమిళ నటి నివేదితా సతీశ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం అయిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం.’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. (మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను)ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. నివేదితా షేర్ చేసిన ఈ ఫొటోలకు గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.హలో సినిమాతో..అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన హలో (2017) సినిమా ద్వారా నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవితగా కనిపించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024). తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది ఇందులో ఆమె 'తేన్పాసియార్' (యాక్షన్ రోల్) అనే కీలక పాత్రను పోషించారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటించారు. (రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్) -
ప్రమాదంలో 16 మంది దుర్మరణం
షోలాపూర్, న్యూస్‌లైన్:తీర్థయాత్రకు వెళ్లిన మహ్మద్ కుటుంబం తిరిగి ఇంటికి రానేలేదు. కర్నాటక అలంద్‌లోని కుడల్ హంగర్గ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహ్మద్ సహా 16 మంది కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరంతా షోలాపూర్ జిల్లావాసులని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో పది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. షోలాపూర్ జిల్లా అక్కల్గుడ్ తాలుకా తడవళ్ గ్రామానికి చెందిన మహ్మద్ ముల్లా, రంజాన్ ముల్లా కుటుంబానికి చెందిన మనుమరాళ్ల పుట్టెంటుకలు తీయడానికి కర్ణాటకలోని ఖ్వాజాబందే నవాజ్ దర్గాకు ఆదివారం అర్ధరాత్రి మినీ టెంపోలో బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున ఐదింటికి కుడల్ హంగర్గ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కర్నాటక రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు ముల్లా కుటుంబం ప్రయాణిస్తున్న టెంపోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టెంపో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆ సమయంలో అందరు గాఢనిద్రలో ఉన్నారు. గాయపడిన వారిలో కొందరిని ఆలందీ, గుల్బర్గాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రుల పేర్లు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక పోలీసు అదికారి ఒకరు తెలిపారు.


