దీపావళి బరిలో సూర్య.. సినిమా ఇదే.. | Suriya New Movie Director Jithu Madhavan Has Been Titled Scene | Sakshi
Sakshi News home page

Suriya: దీపావళి బరిలో సూర్య.. సినిమా ఇదే..

Sep 9 2026 7:01 PM | Updated on Sep 9 2026 8:21 PM

Suriya New Movie Director Jithu Madhavan Has Been Titled Scene

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విజయంతో జోరుమీదున్న సూర్య.. మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  దర్శకుడు జితు మాధవన్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సీన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 
నజ్రియా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జితు మాధవన్‌.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సూర్య, నజ్రియా జోడీ ఎలా అలరిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: ఇక రిటైర్‌ కావాలనుకుంటున్నా: అమితాబ్‌ బచ్చన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement