‘స్పిరిట్‌‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’ | Sandeep Reddy Vanga Brother Challenges Reviewers Over Spirit | Sakshi
Sakshi News home page

Spirit Movie: రివ్యూవర్లకు సందీప్ రెడ్డి వంగా సోదరుడి సవాల్!

Sep 12 2026 9:38 PM | Updated on Sep 12 2026 9:47 PM

Sandeep Reddy Vanga Brother Challenges Reviewers Over Spirit

సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్‌ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 

ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..
సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‌

‘స్పిరిట్‌’తో చూస్తాం!
ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement