breaking news
pranay reddy
-
స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్
-
‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ‘రొమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలపై మాట్లాడిన ప్రణయ్.. రివ్యూవర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.‘రివ్యూ చేయడం చాలా ఈజీ’..సినిమా రివ్యూ చేయడం చాలా సులభమైన పని అని ప్రణయ్ అభిప్రాయపడ్డారు. దాదాపు 90 శాతం సినిమాలు లేదా 10లో 9 సినిమాలు విడుదలైన తర్వాత విఫలమవుతుంటాయని.. వాటిని రివ్యూ చేయడం సులభమేనని అన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‘స్పిరిట్’తో చూస్తాం!ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘రొమాంచకం’ చిన్న సినిమా కాబట్టి దానిపై రివ్యూవర్లు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ సినిమా విషయంలో చేసినట్లే పెద్ద సినిమా అయిన ‘స్పిరిట్’ విషయంలోనూ చేయగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘స్పిరిట్’ విడుదలైనప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!తాము ఆ సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ చేస్తాం: ప్రణయ్ రెడ్డి
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? వాళ్ల ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? అనేది ‘రోమాంచకం’ సినిమాలో మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 20 నిమిషాల టైమ్‌లో ఎక్కడా బోర్ కొట్టదు’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో చెప్పిన విశేషాలు. (చదవండి: మూడు వారాల్లోపే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్)→ సినిమా నిర్మాణం సీరియస్‌గా చేయాలని టీమ్స్‌ను పెట్టుకుని చేసే మైండ్ సెట్లో మేం లేం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నాలుగేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకోవడంతో ‘రోమాంచకం’ తీశాం. → ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మా మూవీ ఔట్పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. సుమంత్, అనంతిక బాగా నటించారు. వాసుకి వైభవ్ అద్భుతమైన సంగీతం అందించారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి ఇబ్బంది లేకుండా మా మూవీ చూడొచ్చు. → అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిల్మ్ మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు. → ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ రిలీజ్ చేస్తాం... ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి, వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారితో మేం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’ మూవీ పూర్తయ్యాక సందీప్, నేను కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చిన్న చిత్రాలు నిర్మిస్తాం. -
స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్‌లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్‌లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట. -
ఉరవకొండ టీడీపీ నేతలకు ప్రణయ్ రెడ్డి వార్నింగ్
-
బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత
బాలీవుడ్లో నెపోటిజం దగ్గర నుంచి చాలారకాల దందాలు నడుస్తుంటాయి. స్టార్ హీరోలు, వాళ్ల పిల్లలకు మాత్రమే ఛాన్సుల్లాంటివి వస్తుంటాయి. ఇక కొందరు రివ్యూయర్స్ కూడా సౌత్ సినిమాలు, దర్శకుల్ని కావాలనే టార్గెట్ చేస్తుంటారు. ప్రస్తుతం 'సలార్' మీద కూడా అలాంటి దాడే జరుగుతోంది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు, రివ్యూయర్లకు వంగా బ్రదర్స్ ఇచ్చిపడేస్తున్నారు. మొన్నీ మధ్య సందీప్ రెడ్డి వంగా రెచ్చిపోగా.. తాజాగా ఇతడి అన్న, 'యానిమల్' నిర్మాత ప్రణయ్ రెడ్డి.. బాలీవుడ్‌లోని మరో స్కామ్ గురించి రివీల్ చేశాడు. తాజాగా తెలుగులో ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా.. 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అనేది బాలీవుడ్లో ఉంటుందని, దాన్ని ఫాలో అయ్యుంటే తమ 'యానిమల్' మూవీ.. ఎప్పుడో రూ.1000 కోట్ల కలెక్షన్స్ దాటేసి ఉండేదని చెప్పుకొచ్చాడు. కానీ మేం అలా చేయలేదని.. 'యానిమల్' సినిమా వసూళ్లన్నీ పూర్తిగా నిజమని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అసలేంటి 'కార్పొరేట్ బుకింగ్స్' స్కామ్ అని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!) 'కార్పొరేట్ బుకింగ్ స్కామ్' అంటే.. బాలీవుడ్లో స్టార్ హీరో సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి. దానికి బజ్ తక్కువగా ఉన్నా లేదంటే ఓపెనింగ్స్ పెద్దగా రావనే డౌట్ ఉంటే.. నిర్మాతలు బల్క్ బుకింగ్స్‌పై ఆసక్తి చూపిస్తారు. అంటే.. ఓ పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ సదరు కంపెనీనే ఫ్రీగా టికెట్స్ ఇస్తుంది. ఈ సంస్థకు నిర్మాత లేదా హీరోకి సంబంధించిన ఎవరో ఒకరి నుంచి టికెట్స్‌కి సంబంధించిన డబ్బు వస్తుంది. దీంతో బుకింగ్ యాప్స్‌లో షోలన్నీ ఫుల్ అయినట్లు కనిపిస్తాయి. సినిమా నిజంగా హిట్ ఏమో అని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు. ఇలా బాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు.. ఈ రకంగా పలు కంపెనీలతో మాట్లాడుకుని ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యేలా చూస్తారు. తద్వారా రూ.1000 కోట్ల మార్క్ అనేది చాలా సులభంగా రీచ్ అవుతారు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు ఇది తెలియొచ్చు కానీ బయటవాళ్లకు ఇది తెలిసే ఛాన్స్ లేదు. తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పడంతో దీని బండారం బయటపడింది. ఇదే ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ.. 'కార్పొరేట్ స్టార్' అని కూడా అన్నాడు. ఇది షారుక్‌ని ఉద్దేశించి అన్నట్లే అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
‘నారాయణ’లో చదువుకోలేను..
– రెండు నెలలుగా మొండికేసిన ప్రణయ్‌రెడ్డి – ఫీజులు చెల్లించాం.. అక్కడే చదువుకోవాలంటూ తల్లిదండ్రులు బుజ్జగింపు – గత నెలలో తిరుపతికి పారిపోయి కొంతకాలం హోటల్లో పని – తండ్రి కోరిక మేరకు తిరిగొచ్చి చదువు కొనసాగింపు – ఒత్తిడి తట్టుకోలేక రైలు కింద పడి బలవన్మరణం కర్నూలు: ఒత్తిడితో చదువుకోలేక ఓ విద్యార్థి గురువారం ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ బ్రిడ్జిపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలులో సంచలనం రేపింది. దేవనగర్ సమీపంలోని విఠల్ నగర్లో హంద్రీ నది ఒడ్డున ఉన్న ప్రగతి అపార్ట్మెంట్లో దేవేందర్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు సంతానం. దేవేందర్‌రెడ్డి దొడ్ల పాలడైరీలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ప్రణయ్‌రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కుమార్తె జీపిక 1వ తరగతి చదువుతోంది. ప్రణయ్‌రెడ్డి(16) నగరంలోని ఆర్‌ఎంకే ప్లాజా క్యాంపస్‌లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి మధ్యాహ్నం రైలు పట్టాలపై శవమై తేలాడు. బ్రిడ్జి ప్రక్కన పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు, కొద్ది దూరంలో సెల్‌ఫోన్ ఉంచి రైలు కింద పడటంతో తల, మొండెం వేర్వేరు అయ్యాయి. రైలు ట్రాక్‌పై మతదేహం ఉన్నట్లు గ్యాంగ్‌మెన్ కనుగొని స్టేషన్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఎస్ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించాడు. పుస్తకాల్లో ఉన్న అడ్రస్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుకోవడం ఇష్టం లేకనే బలవన్మరణం : తండ్రి దేవేందర్‌రెడ్డి చదువుకోవడం ఇష్టం లేకనే తన కుమారుడు రైలు కిండ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి దేవేందర్‌రెడ్డి రైల్వే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నారాయణ కళాశాలలో చదువుకోలేను.. మరో కాలేజీలో చేర్పించండి.. అక్కడ ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాను అని మొండికేశాడు. గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ హోటల్లో కొంతకాలం పనిచేశాడు. పట్టుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండేవాడని, చదువుకోవాలని చెబితే తమనే కసురుకునేవాడని తెలిపారు. ప్రణయ్‌రెడ్డి కళాశాలకు రాలేదంటూ ఫోన్ చేసి యాజమాన్యం సమాచారం అందిన వెంటనే కుమారునికి ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పాడని, గంట వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులను సమాచారం అందిందన్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగి సాయంత్రం వరకు కోమాలోకి వెళ్లారు. వారికి ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేయించారు. కోలుకున్న అనంతరం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐ జగన్ విచారణ జరిపారు. తండ్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మార్చురీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన... ప్రణయ్‌రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిన వెంటనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాసులు, మహేంద్ర, ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి మతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడితో ప్రణయ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా పది మంది ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలేశారు.


