సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్షల్లో వసూలు చేసి మోసానికి ఒడిగట్టిన ఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది. ఈమేరకు తమకు న్యాయం చేయాలంటూ భాదితులు అంబర్‌పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంతమేర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ తమ దగ్గర రూ.లక్షల్లో డబ్బులు వసూళు చేసినట్లు బాధితులు తెలిపారు. తీరా అడిగే సరికి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని వారంతా వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని వారంతా కోరారు. శివకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: డీ10 విన్నర్ రాజు పై కేసు..
Victims protest at the residence of film distributor Shivakumar Goud.
They alleged that Shivakumar had collected lakhs of rupees from several individuals by promising to secure film offers for them. pic.twitter.com/sQCOa6f0IC— Shakeel Yasar Ullah (@yasarullah) September 12, 2026


