'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్‌.. వెంకటేశ్‌ కామెడీ అదిరింది! | Aadarsha Kutumbam Movie Teaser Out | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Teaser: 'ఆదర్శ కుటుంబం' టీజర్ చూశారా?

Sep 12 2026 4:09 PM | Updated on Sep 12 2026 4:46 PM

Aadarsha Kutumbam Movie Teaser Out

వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్.  తాజాగా టీజర్ విడుదల చేసి థియేటర్లలోకి వచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్‌ విషయానికొస్తే..  కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ‘ఆదర్శ కుటుంబం – AK47’ ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement