పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత | Namitha Questions Why Only Women Should Wear Thali After Marriage | Sakshi
Sakshi News home page

Namitha: మహిళలే తాళి ఎందుకు కట్టుకోవాలి?: నమిత

Sep 12 2026 3:56 PM | Updated on Sep 12 2026 4:22 PM

Namitha Questions Why Only Women Should Wear Thali After Marriage

ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్‌ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యులో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. భారతీయ వివాహ సంప్రదాయాలు, మహిళలపై రుద్దుతున్న ఆచారాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. మగవాళ్ల​కు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకని ఆమె ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
మగవాళ్లూ ఈ పనులు చేయచ్చు కాదా..
‘పెళ్లి అనేది ఇద్దరిదీ.. మరి  తాళి ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి. మహిళలే బొట్టు ఎందుకు పెట్టికోవాలి. అన్ని సంప్రదాయాలు వాళ్లే ఎందుకు పాటించాలని అందరూ అంటారు. వివాహానికి సంబంధించిన సంప్రదాయాలు ఇద్దరికీ సమానంగా ఉండాలి. మగవాళ్లు కూడా ఈ పనులు చేయచ్చు కదా.  భర్త కోసం ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా. అలాంటిదేమీ లేదు కదా. అన్ని నిబంధనలు మహిళలకే ఎందుకు? ఇవన్నీ మనం సృష్టించుకున్నవే తప్పా ఏ గ్రంథంలోనూ ఇలాంటివి లేవు’ అని నమిత అభిప్రాయ పడ్డారు.
ఇదీ చదవండి: 80s ఫొటో ట్రెండా బాస్‌.. అభిమానం కోసం ఈ తప్పులు చేయద్దు..

సొంతం సినిమాతో.
7 ఏళ్ల వయసులో మిస్‌ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్‌ ఇండియా పోటీల్లో థర్డ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement