హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్‌లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.
సెప్టెంబర్ 18న విడుదల..
సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం


