నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?
తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం..
‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్‌కి ట్రైలర్ ఉండదు. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం టీమ్ మొత్తం కలిసి పనిచేయాలి. ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. దీనికోసం నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని నాని చెప్పుకొచ్చారు. దీంతో ట్రైలర్ లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా రాబోతోందనే ఆసక్తి నెలకొంది.


