breaking news
418 Movie
-
'418' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
హారర్ మూవీ ‘418’ రివ్యూ
టైటిల్: 418నటీనటులు: చైత్ర ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ తదితరులునిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్సమర్పణ : ప్రశాంత్ నీల్‌దర్శకత్వం: కీర్తన్ నాదగౌడసంగీతం: వెంకీ జీజీసినిమాటోగ్రఫీ: దినేష్ దివాకర్విడుదల తేది: అక్టోబర్ 23, 2026కథేంటంటే.. వివేక్(సూర్య రాజ్)ని డాక్టర్‌గా చూడాలని అతని తల్లిదండ్రుల కల. ఆస్తులు అమ్మి కొడుకుని మెడికల్ కాలేజీలో చేర్పిస్తారు. ఆ కాలేజీ హాస్టల్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుస్తారు. అయితే అందులో 418 నంబర్ గదిని మాత్రం మూసే ఉంచుతారు. అంతేకాదు ఆ హాస్టల్లోకి అమ్మాయిలను అడుగుపెట్టనివ్వరు. అలాంటి హాస్టల్లోని 417 గదిలోకి వివేక్ చేరతాడు. అప్పటికే ఆ గదిలో మరో స్టూడెంట్ రోహిత్(చరణ్ లక్కరాజు) ఉంటాడు. ఓ రోజు స్నేహితులంతా కలిసి 418 గదిని తెరవాలని ప్లాన్ వేస్తారు. వివేక్ మాత్రం గదిలోనే ఉంటాడు. మిగిలివారంతా 418 గదిని తెరవడానికి వెళ్తారు. కానీ చివరి నిమిషంలో తమ ప్లాన్‌ని విరమించుకొని బయటకు వెళ్తారు. అదే రోజు రాత్రి వివేక్‌పై హత్యాయత్నం జరుగుతుంది. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. దీనంతటికి 418 నంబర్ గదినే కారణం అవుతుంది. అసలు ఆ గదిని ఎందుకు మూసేశారు? అందులో ఉన్నదెవరు? హాస్టల్లోకి అమ్మాయిలను ఎందుకు రానివ్వడం లేదు? 15 ఏళ్ల క్రితం ఆ మెడికల్ హాస్టల్లో జరిగిన ఘోరం ఏంటి? లండన్ నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి పగడాల) ఆ గదిలోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నించింది? హాస్టల్లోకి ఆమె వెళ్లిన తర్వాత ఏం జరిగింది? దేవిక(చైత్ర ఆచార్) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఒక పాత బంగ్లా, అందులో ఒక ఆత్మ, దానికో ప్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్‌తో చాలా వరకు తీస్తుంటారు. ‘418’కథ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో '418' టీమ్ కొంతవరకు మాత్రమే సఫలం అయింది. కొన్ని చోట్ల నేపథ్య సంగీతంతో భయపెట్టినప్పటికీ.. కథనం చాలా వరకు బోరింగ్ సాగుతుంది. అసలు దర్శకుడు చెప్పాలనుకున్న విషయంలోనూ క్లారిటీ మిస్ అయిందనిపిస్తుంది.(చదవండి: ‘నా వైఫ్ మిస్సింగ్’ రివ్యూ: వరుణ్, శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ మెప్పించారా?)కథ ప్రారంభం బాగుంటుంది. హారర్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఇందులో ఉంటాయి. అయితే వాటిని ఆసక్తికరంగా మల్చడంలోనే దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. ప్రధాన పాత్రలంతా హాస్టల్లో కలుసుకోవడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది.ఆ తర్వాత కథే ముందుకు సాగదు. ఒకటి రెండు భయపెట్టే సీన్లు తప్ప ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. ఇక ద్వితియార్థం ఉన్నంతలో కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది. దేవిక నేపథ్యాన్ని సైకలాజికల్ కోణంలో చూపించడం, ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. చివరి పావుగంట కాస్త భయం కలిగించేలా ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా హారర్ సినిమాలు చూసేవాళ్లను ఈ సినిమా భయపెట్టకపోవచ్చు.ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం కన్నడ నటి చైత్ర ఆచార్. దేవిక పాత్రలో ఆమె నటన చాలా బాగుంది. కొన్ని చోట్ల భయపెట్టిస్తే..మరికొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేస్తుంది. మిగిలిన నటీనటులంతా కొత్త వాళ్లే. అయినప్పటికీ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వెంకీ జీజీ నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ఫౌజీ అప్డేట్.. ఆ హారర్ సినిమాకి వెళ్లి చూడచ్చు: నిర్మాత
మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈవెంట్లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్.. ప్రభాస్ 'ఫౌజీ' అప్డేట్పై స్పష్టత ఇచ్చారు.‘ప్రభాస్ బర్త్‌డే (అక్టోబర్23) కానుకగా ఫౌజీ నుంచి ఒక ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా సినిమా కథా నేపథ్యం ఏంటి? దర్శకుడు హను రాఘవపూడి ఎలాంటి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు? ప్రభాస్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది’అని తెలిపారు. అయితే ఆ వీడియోను బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయితే ఆ వీడియోను వెండి తెరపై చూడలనుకునేవారు.. హారర్ చిత్రం '418' ప్రదర్శితమయ్యే థియేటర్లలో చూడవచ్చు అని తెలిపారు. తద్వారా మంచి ఫీల్ కలుగుతుందని తెలిపారు. కాగా 418 చిత్రం అక్టోబర్ 23న విడుదల కానుంది.సినిమా విషయానికి వస్తే..కాగా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: పెద్ద ఫ్యామిలీ నటుడు అయితే ఇలా అనేవారా?: మౌళి) Mythri Ravi Drops an Interesting Update on Prabhas’ #Fauji at Donga Naa Koduku Event #MythriRavi #Prabhas #DongaNaaKoduku https://t.co/oG31IY1mgv— Telugu360 (@Telugu360) October 21, 2026 -
15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
హారర్ సినిమాలంటేనే భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠ రేపే ట్విస్టులు గుర్తుకొస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో హారర్ జానర్లో సరికొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అలాంటి ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘418’. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీ, భయానక వాతావరణంతో ఆసక్తిని పెంచుతోంది.సెప్టెంబర్ 18న విడుదల..సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందించగా.. వెంకీ జీజీ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ముందుగా జూలై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదీ చదవండి: బోల్తాకొట్టిన‘టాక్సిక్’.. బాక్సాఫీస్‌లో భారీ నష్టం


