మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు జరిగింది. ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్.. ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్‌పై స్పష్టత ఇచ్చారు.
‘ప్రభాస్ బర్త్‌డే (అక్టోబర్23) కానుకగా ఫౌజీ నుంచి ఒక ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా సినిమా కథా నేపథ్యం ఏంటి? దర్శకుడు హను రాఘవపూడి ఎలాంటి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు? ప్రభాస్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే విషయాలపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది’అని తెలిపారు. అయితే ఆ వీడియోను బాహుబలి రేంజ్ లో ఊహించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఆ వీడియోను వెండి తెరపై చూడలనుకునేవారు.. హారర్ చిత్రం '418' ప్రదర్శితమయ్యే థియేటర్లలో చూడవచ్చు అని తెలిపారు. తద్వారా మంచి ఫీల్ కలుగుతుందని తెలిపారు. కాగా 418 చిత్రం అక్టోబర్ 23న విడుదల కానుంది.
సినిమా విషయానికి వస్తే..
కాగా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
(ఇదీ చదవండి: పెద్ద ఫ్యామిలీ నటుడు అయితే ఇలా అనేవారా?: మౌళి)
Mythri Ravi Drops an Interesting Update on Prabhas’ #Fauji at Donga Naa Koduku Event #MythriRavi #Prabhas #DongaNaaKoduku https://t.co/oG31IY1mgv
— Telugu360 (@Telugu360) October 21, 2026


