పాక్ సినిమాలో 'సలార్' ఫైట్ కాపీ? వీడియో వైరల్ | Salaar Movie Fight Scene In Pak Cinema Latest | Sakshi
Sakshi News home page

Salaar Movie: 'సలార్' ఫైట్ పాక్‌లో కాపీ.. అసలు నిజమేంటి?

Sep 12 2026 2:18 PM | Updated on Sep 12 2026 2:36 PM

Salaar Movie Fight Scene In Pak Cinema Latest

పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా 'సలార్'. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించేసరికి ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల విషయంలో పలుమార్లు వాయిదా పడటంతో ఎందుకనో థియేటర్లలో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. కానీ తర్వాత కాలంలో ఓటీటీ, టీవీలో ప్రసారమైన తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో 'సలార్' గురించి వినిపిస్తూనే ఉంటుంది.

కానీ రీసెంట్‌గా కొన్నిరోజుల నుంచి 'సలార్' ఫైట్ సీన్‌ని పాకిస్తాన్‌కి చెందిన ఓ సినిమాలో కాపీ కొట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. పాక్‌కి చెందిన హసీబ్ బిలాల్ అనే ఇన్ఫ్లుయెన్సర్.. ఏఐ ఉపయోగించి 'సలార్' స్ఫూర్తిగా తన ప్రతిరూపంలో వీడియో సృష్టించి దానిని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. చూడటానికి ఇది రియల్‌గా ఉండేసరికి చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. మరి వీళ్లు ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత 'సలార్ 2' కోసం కలుస్తారేమో చూడాలి? దీని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement