మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ నెల 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈసారి ‘ఎండ్‌గేమ్’ని 4DX, MX4D, SCREEN X, డాల్బీ విజన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు.
ఇదీ చదవండి: నాకు ఈగో లేదు.. ఆ రూమర్స్ పట్టించుకోవద్దు: శ్రీలీల
ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను కూడా చూపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
‘ఎండ్‌గేమ్’ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతని పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. కెవిన్ ఫైజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?


