మరో రెండు వారాల్లో నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మార్చి, ఆగస్టు అని చెప్పి రెండుసార్లు వాయిదా పడింది. ఈసారి కూడా అలానే జరగొచ్చు అని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది.
ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
'ప్యారడైజ్' సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. గతంలో ఇతడు నానితో 'దసరా' తీశాడు. ఇప్పుడు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఎప్పుడు చూసినా గానీ శ్రీకాంత్ సీరియస్‌గా ఫేస్ పెట్టి కనిపిస్తుంటాడు. పెద్దగా నవ్విన సందర్భాలు కూడా లేవు. ఎవరో ఈ విషయమై కామెంట్ చేయగా.. దీనికి రిప్లై ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. 'నా ముఖమే అంతా' అని ఓ మీమ్ ఫొటోని పోస్ట్ చేసి సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.
పీరియాడికల్ సినిమాగా తీసిన 'ప్యారడైజ్'లో ప్రధానంగా తల్లికొడుకుల ఎమోషన్ ఉండనుందని హీరో నాని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ లాంటిది ఏం లేకుండానే చిత్రం థియేటర్లలోకి రానుందని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? దీని తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో మూవీ కమిట్ అయ్యాడు.
ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
😂♥️#TheParadiseWillRiseFromSept24 https://t.co/pw00Bli9v0 pic.twitter.com/Sb3obcARmG
— Nani (@NameisNani) September 11, 2026


