టీవీ షో డీ10 విన్నర్‌ రాజు పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు | TV Show Dhee10 Winner Raju Arrested Over Harassment Allegation | Sakshi
Sakshi News home page

డీ10 విన్నర్‌పై కేసు.. యువతిని వేధించాడంటూ ఆరోపణలు

Sep 12 2026 4:32 PM | Updated on Sep 12 2026 5:18 PM

TV Show Dhee10 Winner Raju Arrested Over Harassment Allegation

డీ10 టీవీ షో విన్నర్‌ రాజుపై మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈ నెల 9న మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్‌.. వెంకటేశ్‌ కామెడీ అదిరింది!

కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు రాజును అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే రాజుపై కేసు నమోదు చేసిన విషయాన్ని మియాపూర్‌ పోలీసులు ఇన్నిరోజులుగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.

డీ10 టీవీ షో ద్వారా రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement