చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్‌ | Chinese Woman Dance to Prabhas Pournami Song Goes Viral | Sakshi
Sakshi News home page

చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్‌

Sep 8 2026 3:27 PM | Updated on Sep 8 2026 3:45 PM

Chinese Woman Dance to Prabhas Pournami Song Goes Viral

కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్‌, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.
ఇదీ చదవండి: వినాయకుడు ఫైర్‌.. దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్‌
ఆకట్టుకునేలా..
తాజాగా ఈ పాటకు ఓ చైనా యువతి అద్భుతంగా నాట్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మీరా వాంగ్‌ అనే యువతి షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దుస్తులు ధరించి ‘భరత వేదముగ’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్‌ చేశారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలుగు సినిమా పాటకు చైనా యువతి ఇంత అందంగా నాట్యం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం సరిహద్దులు దాటి ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement