ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా! | Bigg Boss 10 Telugu Nagarjuna Special Surprise for Ramprasad Rohith and Vamsi | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!

Sep 12 2026 8:02 PM | Updated on Sep 12 2026 8:06 PM

Bigg Boss 10 Telugu Nagarjuna Special Surprise for Ramprasad Rohith and Vamsi

బిగ్‌బాస్‌ సీజన్‌-10లో తొలి వీకెండ్‌ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌ చేయనున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత

ఊహించని సర్‌ప్రైజ్‌
ఈ వారం హౌస్‌లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్‌ప్రసాద్‌, రోహిత్‌, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు.

వారు తాగిన మిల్క్‌షేక్‌ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్‌మేట్స్‌ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్‌ ఎపిసోడ్‌లో రామ్‌ప్రసాద్‌, రోహిత్‌, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్‌గా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement