‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .
సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.
లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు.
రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు.


