తలా అజిత్‌తో సీఎం విజయ్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ట్రీట్! | CM Vijay Met With Hero Ajith: A surprise treat for fans | Sakshi
Sakshi News home page

తలా అజిత్‌తో సీఎం విజయ్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ట్రీట్!

Sep 12 2026 11:39 PM | Updated on Sep 12 2026 11:49 PM

CM Vijay Met With Hero Ajith: A surprise treat for fans

తమిళనాడు సీఎం, హీరో విజయ్.. స్టార్ హీరో అజిత్ కుమార్‌ను లండన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో కలిశారు. ప్రస్తుతం ‘మిచెలిన్ లీ మ్యాన్స్ కప్’లో పాల్గొంటున్న అజిత్‌ను విజయ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండేది. వీరిద్దరి అభిమానుల మధ్య రైవల్రీ కూడా ఉన్నప్పటికీ.. వీరి తాజా భేటీ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముఖ్యమంత్రిగా విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లగా.. అక్కడే అజిత్‌తో ఈ అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఒకరిని ఒకరు చూసిన వెంటనే ఆనందంతో విజయ్ పరుగెడుతూ వెళ్లి అజిత్‌ను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు రాజకీయ నాయకుడిగా, మరొకరు సినీ రంగంతో పాటు మోటార్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్నారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాల్లో సరికొత్త ప్రయాణం సాగిస్తున్న వేళ జరిగిన ఈ భేటీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement