రీల్స్‌ పిచ్చి.. నదీ ప్రవాహంలో చిక్కుకుని విలవిల | Men drive SUV into fast flowing river in JK to film reel | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి.. నదీ ప్రవాహంలో చిక్కుకుని విలవిల

Sep 12 2026 8:56 PM | Updated on Sep 12 2026 8:56 PM

 Men drive SUV into fast flowing river in JK to film reel

సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన వీడియో పోస్ట్‌ చేసి పాపులర్‌ కావాలనే ప్రయత్నంలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకరమైన చర్యకు పాల్పడ్డారు. ఓ ఎస్‌యూవీని నదిలోకి నడిపిస్తూ వీడియో చిత్రీకరించారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వారు వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోని సింధ్ నది ప్రాంతంలో, హోటల్ సింధ్ రిసార్ట్స్ సమీపంలో జరిగింది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా బలంగా ఉండటంతో స్కార్పియో నీటిలో చిక్కుకుపోయింది. వాహనంలోని వారు దాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. వాహనంలోని అందరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులు సమాచారమందుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వైరల్‌గా మారిన వీడియోలో.. కొందరు వ్యక్తులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తూ నదిలోకి వెళ్లడం కనిపిస్తుంది. వాహనం నీటిలోకి వెళ్లిన తర్వాత కూడా వారు వీడియో చిత్రీకరణ కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడ్డారు.

వాహనం నదిలోకి వెళ్లడంతో పరిస్థితి ఎప్పుడు అదుపు తప్పుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. వాహనం నీటిలో చిక్కుకుంటే అందులో ఉన్నవారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినా వీడియో కోసం వారు ఈ ప్రమాదాన్ని పట్టించుకోలేదు.

ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస‍్తున్నారు. ఇటువంటి వీడియో తీసుకోవడం కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వాహనాన్ని నదిలోకి తీసుకెళ్లిన వ్యక్తుల తీరును విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement