ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్‌పింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?


