బ్రిక్స్‌ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు | Narendra Modi spoke at the BRICS inaugural session | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు

Sep 12 2026 5:02 PM | Updated on Sep 12 2026 5:34 PM

Narendra Modi spoke at the BRICS inaugural session

ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.  వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను  బలోపేతం చేయాలన్నారు.

మోదీ మాట్లాడుతూ..  "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ  కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని  మోదీ అన్నారు. 

అయితే  అంతకుముందు ప్రధాని మోదీ  అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్‌తో హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 

గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్‌  భారత్ లో అడుగుపెట్టారు.  చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్‌పింగ్‌తో ఉంది. భారత్‌తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement