సమంత సీమంతంలో శ్రీచక్ర పూజ.. అసలెందుకు చేస్తారు? | Samantha Seemantham Special, What Is The Significance Of Sri Chakra Pooja In Sri Vidya Tradition? Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Samantha Seemantham: సమంత సీమంతం వేడుక.. ‍అసలెందుకు ఇంత స్పెషల్?

Sep 15 2026 2:53 PM | Updated on Sep 15 2026 3:19 PM

samantha Seemantham Special eye On Sri Chakra Pooja in srividya tradition

టాలీవుడ్‌ హీరోయిన్ సమంత ఈ ఏడాది గ్రాండ్ సక్సెస్ కొట్టింది. మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటితో పాటు ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది. సమంత సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సీమంతం ప్రత్యేకతలివే..

అయితే సమంత సీమంతం వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ సీమంతం కంటే భిన్నంగా నిర్వహించిన తీరు ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా ప్రత్యేక శ్రీవిద్య పూజా విధానంలో నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పూజ ఎందుకు చేస్తారని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. సమంత సీమంతంలో నిర్వహించిన ప్రత్యేక పూజా విధానం వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా జరిగే సీమంతం వేడుకల్లో ఆశీర్వాదాలు, సంప్రదాయ ఆచారాలు ప్రధానంగా కనిపిస్తాయి. కానీ సమంత సీమంతంలో మాత్రం ఆధ్యాత్మిక విశిష్టతకు పెద్దపీట వేశారు. శ్రీవిద్య ఉపాసకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో శ్రీచక్ర యంత్రం మధ్యలో సమంతను కూర్చోబెట్టి ప్రత్యేక మంత్రోచ్ఛారణలు చేశారు.

ఈ పూజతో తల్లి గర్భంలోని శిశువుకు దైవిక రక్షణ కలగాలనే సంకల్పంతో ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, పవిత్ర జలాలతో శుద్ధి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సమంత వెల్లడించారు. తల్లి, బిడ్డ చుట్టూ ఆధ్యాత్మిక రక్షణ వలయం ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. శ్రీవిద్యా సంప్రదాయంలో పాతుకుపోయిన సాంప్రదాయ కళా ఆవరణ (శ్రీ కల్పం) ఆచారాన్ని నిర్వహించి సమంత హాట్ టాపిక్‌గా మారారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గర్భిణిని దేవి స్వరూపంగా భావించే ఈ ఆచారం తనను ఎంతో కదిలించిందని రాసుకొచ్చింది. తన బిడ్డ కోసం ఇలాంటి పవిత్ర అనుభూతిని పొందడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

(ఇది చదవండి: సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్)

సామ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.." మన సంప్రదాయాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రగాఢమైన గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మంత్ర ధ్వనిలో.. జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిలో..ప్రాచీన ఆచారాలు తరతరాలుగా జాగ్రత్తగా అందించబడిన విధానంలో ఏదో ఒక లోతైన శక్తి పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని పోస్టు చేసింది. కాగా.. సమంత గతేడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement