ఈ తార పట్టిందే బంగారం.. ఏడాదిలో 1000 కోట్లు.. | Mamitha Baiju Becomes A Most Wanted Heroine With Five Back To Back Box Office Hits Over Rs 1000 Crore, Read Story Inside | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: ఏడాదిలోనే ఊహించని రేంజ్‌కు మమితా బైజ్

Sep 15 2026 2:54 PM | Updated on Sep 15 2026 4:14 PM

Mamitha Baiju 5Films Cross Rs 1000 Crores in Box Office

ఒకప్పుడు చిన్న పాత్రలతో మెప్పించిన ఈ మలయాళ భామ..ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస విజయాలు.. భారీ వసూళ్లతో మమిత బైజు క్రేజ్‌ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది.  పట్టింది ప్రతీదీ బంగారం అన్నట్లుగా.. వరుసగా ఆమె నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ అమ్మడికి స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌లో డిమాండ్‌ పెరిగిపోయింది. అసలు ఆ ఐదు సినిమాలు ఏంటి..? మమిత బైజు కేరీర్‌ను మలుపు తిప్పిన ఆ విజయాలు ఏంటో చూద్దాం..!

‘కర’తో 50 కోట్లు..
తమిళ హీరో ధనుష్‌ కథానాయకుడిగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన చిత్రం ‘కర’ ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది.  విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్  ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేశాయి. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో తెరకెక్కించారు.  అయితే ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

‘డ్యూడ్‌’తో100 కోట్లు
ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌ నెల 17 విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లుకు పైగా వసూళ్లు సాధించింది.  
ఇదీ చదవండి: ’మండాడి‘పై రజినీకాంత్‌ రివ్యూ.. నటుడు ఎమోషనల్‌
‘జననాయగన్‌’తో 300కోట్లకు పైగా.. 
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌( తెలుగులో జన నాయకుడు). హెచ్‌.వినోద్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. ఈ చిత్రం జులై 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగులో అంత విజయం సాధించనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూళ్లు రాబెట్టింది.

బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ 300 కోట్లు
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘'బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ కూడా ఒకటి. మమితా బైజు, నివీన్ పౌలీ నటించిన ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించింది. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300ల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సెప్టెంబర్‌ 4న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అయింది. ‘ప్రేమలు’ఫేమ్‌ గిరీశ్‌ ఏడీ దర్శకత్వం వహించారు.  
ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్‌లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ 260 కోట్లు
సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. సెప్టెంబర్‌11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement