ఓటీటీ తర్వాత థియేటర్‌లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది? | Mirzapur And EPIC Failed At Box Office | Sakshi
Sakshi News home page

Epic And Mirzapur: ఓటీటీలో హైప్.. కానీ థియేటర్‌లో ఎందుకిలా?

Sep 15 2026 2:20 PM | Updated on Sep 15 2026 2:46 PM

Mirzapur And EPIC Failed At Box Office

సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు కొన్నివారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం బిగ్ స్క్రీన్స్‌పై కాకుండా నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఓటీటీల్లో హిట్ అయిన సిరీస్‌ల్లోని పాత్రలని తీసుకుని వాటిని సినిమాలుగా మార్చి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్ టైంలో అలా 'మీర్జాపుర్', 'ఎపిక్' వచ్చాయి. కానీ ఓటీటీలో వీటికి దక్కిన ఆదరణకు.. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్‌కి ఏ మాత్రం సంబంధం లేదు. మరి వీటి విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

(ఇదీ చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన)

'మీర్జాపుర్'.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ సిరీస్.. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్ అనే ఊరిలో జరిగే కల్పిత కథ. తెలుగుతో ఎలాంటి సంబంధం లేదు. అయినాసరే డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మనోళ్లకు తెగ నచ్చేసింది. మున్నా భయ్యా, కాళీన్ భయ్యా, గుడ్డు భయ్యా, బబ్లూ భయ్యా.. ఇలా ఈ సిరీస్‌లోని పాత్రలు, కథాకథనాలు మర్చిపోలేనంతగా రిజిస్టర్ అయిపోయాయి.

2018లో తొలి సీజన్ రిలీజ్ కాగా 2020లో రెండోది, 2024లో మూడో సీజన్ వచ్చాయి. తొలి సీజన్ అదరగొట్టినప్పటికీ మిగిలిన వాటికి మిశ్రమ స్పందన వచ్చింది. ఓటీటీలో అదరగొట్టిన ఈ సిరీస్‌ని సినిమాగా తీస్తున్నాం అనేసరికి ఇంకేం స్టోరీ చూపిస్తారా అని చాలామంది అనుకున్నారు. కానీ పాత్రల్ని మాత్రమే తీసుకుని కొత్త క్యారెక్టర్లని ప్రవేశపెట్టి భిన్నంగా ప్రెజెంట్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. సిరీస్‌లో ఉన్నట్లు హై ఇచ్చే సీన్స్ పెద్దగా లేకపోయేసరికి ఓవరాల్‌గా ఓకే ఓకే అనిపించుకుంది.

(ఇదీ చదవండి: ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ రివ్యూ)

ఇక 'ఎపిక్' విషయానికొస్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన తెలుగు సినిమా ఇది. మన దగ్గరే హిట్ అయిన #90స్ వెబ్ సిరీస్‌లోని ఆదిత్య అనే పిల్లాడి పాత్రని తీసుకుని వాడు పెరిగి పెద్దయి.. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఓ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో మూవీ తీశారు. ట్రైలర్, పాటలతో కాస్త ఆసక్తి కలిగించారు గానీ మూవీని సరిగా తీయలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేసింది.

ప్రేమకథ అన్నారు గానీ ఏ మాత్రం రిలేటబుల్‌గా లేని సన్నివేశాలతో విసుగెత్తించారని 'ఎపిక్' చూసిన చాలామంది చెప్పారు. సిరీస్‌లో పాత్రని చూసి తమలా ఉందని చాలామంది అనుకున్నారు. అదే మూవీ చూస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఫీలింగ్ రాకపోవడం పెద్ద మైనస్. ముద్దు, శృంగార సన్నివేశాలు కూడా మరీ ఎక్కువైపోవడం ఈ చిత్రానికి మరింత నెగిటివిటీకి కారణమైంది.

ఈసారి ఎవరైనా దర్శకనిర్మాతలు.. ఓటీటీలో హిట్ అయిన సిరీస్‌లని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీద్దామనుకుంటే మాత్రం ఇలాంటి తప్పుల్ని రిపీట్ చేయకుండా కాస్త రిలేటబుల్ కంటెంట్‌తో వస్తే బెటర్. అలా కాదని క్రేజ్‌ని క్యాష్ చేసుకుందామనుకుంటే మాత్రం మొదటికే మోసపోవచ్చు!

(ఇదీ చదవండి: నాయకత్వం అంటే ఇది కాదు.. తమిళ బిగ్‌బాస్‌లో రాజకీయ రగడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement