సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో పాటు సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను చూసిన రజినీకాంత్ చిత్రబృందానికి మెచ్చుకున్నారు. ముఖ్యంగా సూరి నటనను ప్రశంసించారు. ఈ క్రమంలో రజినీకాంత్ స్వయంగా సూరికి ఫోన్ చేసి అభినందించారు.
ఇదీ చదవండి: అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి

రజినీ కాంత్ నుంచి ఫోన్
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజినీకాంత్.. ఆయన నటనను మెచ్చుకుంటూ స్వయంగా ఫోన్ చేశారు. దీంతో సూరి భావోద్వేగానికి గురయ్యారు. రజినీకాంత్ నుంచి వచ్చిన ఈ కాల్ తనకు ఎంతో ప్రత్యేకమని సూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో జరిగిన సంభాషణకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.
ఈ చిత్రంలో సూరితో పాటు సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్ జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు నటించారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబెడుతోంది.
ఇది చదవండి: ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన
కథ ఏంటంటే..
శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం అనే గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. సాట్టా పులి(సుహాస్) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటాడు. పడవల తయారీ వ్యాపారం చేస్తూనే.. సునామీ రైడర్స్ జట్టుతో ప్రతిసారి పడవ పోటీలకు దిగుతూ విజేతగా నిలుస్తుంటాడు. ఈ సారి టీమ్‌లోకి తీసుకోమని మండాడి వర్గానికి చెందిన మల్లేష్ అనే కుర్రాడు అడుగుతాడు. అందుకు పులి కొడుకు కిశోర్ ఒప్పుకోకపోవడంతో గంగాలమ్మ జాతరలో అతనిపై దాడి చేస్తాడు. దీంతో పులి..తన మనుషులతో మల్లేష్‌ని చంపించేందుకు ప్రయత్నిస్తాడు. ప్రాణాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న కాళి(సూరి) దగ్గరకు వస్తాడు.
పూర్తి రివ్యూ కోసం ఇది చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్


