తెలుగు బిగ్‌బాస్ షోలో ఈసారి తొలిసారి నామినేషన్ల సందడి గట్టిగానే వినిపించింది. గతవారం కంటెస్టెంట్స్ మధ్య పోటీలు పెట్టి హౌస్‌మేట్స్ అయ్యే ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలోనే చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. మరో ఎలిమినేషన్ కూడా జరగొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండానే వీకెండ్ అయిపోయింది. ఇక సోమవారం రాగానే ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలైంది. ఇంతకీ 8వ రోజైన సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?
(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ పిలిచినప్పుడల్లా ఇద్దరు హౌస్‌మేట్స్.. ఏర్పాటు చేసిన దారిలో నుంచి వెళ్లి ఏదో ఒక పోల్ ఎంచుకుని దానికి చుట్టి ఉన్న తాడు మొత్తాన్ని తీసి అక్కడే ఉన్న రెండు గొడ్డళ్లలో(సిల్వర్, గోల్డ్) ఒకటి ఎంచుకోవాలి. సిల్వర్ పట్టుకుంటే ఒకర్ని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. గోల్డ్ ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఓడిపోయిన వాళ్లకు ఆ రౌండ్‌లో ఒక నామినేషన్ ఓటు పడుతుంది. గొడ్డలిని అందుకున్న వాళ్లు ఆ రౌండ్‌లో ఓడిపోయిన వాళ్లతో సహా ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.
తొలుత వచ్చిన ఝాన్సీ, సుధీర్‌లలో గెలిచిన సుధీర్.. గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. మొదట త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. తన దగ్గర ఒక మాట మాట్లాడి రోహిత్ దగ్గర మరొకటి చెప్పాడని.. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెబుతున్నాడని కారణం చెప్పాడు. చైత్ర విషయంలోనూ తన ఆట చూడకుండా కత్తితో పొడిచావని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత షాలిని పేరు చెప్పాడు. షాలినికి వాష్రూం క్లీనింగ్ ఇస్తే దాన్ని తీసుకోలేక బదులుగా పవర్ వాడుకోవడం నచ్చలేదని కారణం చెప్పాడు. తర్వాత కృష్ణుడు, దేబ్జానీ గేమ్ ఆడగా దేబ్జానీ గెలిచింది. ఈమె సిల్వర్ గొడ్డలి పట్టుకుని త్రిగుణ్‌కి నామినేట్ చేసింది. ఏమైనా ఉంటే నేరుగా చెప్పట్లేదు పక్కవాళ్ల దగ్గరకు వెళ్లి చెప్తున్నావ్. సుధీర్ గురించి నాకు చెప్పడం నచ్చలేదని కారణం చెప్పింది.

వర్షిణి, రోహిత్‌లలో రోహిత్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తొలుత త్రిగుణ్ పేరు చెప్పి.. ప్రపంచం తెలిసిన నువ్వు నన్ను స్టెరాయిడ్స్ బాడీ అనడం నచ్చలేదు. అక్కడో మాట ఇక్కడో మాట నాకు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా చెత్త మేటర్ అది. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపానని అన్నారు.. ఓ ఆడపిల్ల విషయంలో మీరు అలా అనడం నాకు అస్సలు నచ్చలేదని రోహిత్ అన్నాడు. ఇలా కాసేపు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్ తన రెండో నామినేషన్ ఝాన్సీకి వేశాడు. సేఫ్ గేమ్ ఆడటం మానేయ్ అని ఆమెతో చెప్పాడు. దీనికి బదులిచ్చిన ఝాన్సీ.. నాకు నా స్టాటజీ ఉంది. నువ్వే చాలాసార్లు వాళ్లు ఏం అనుకుంటున్నారో చెప్పు అని అడిగావ్? అని రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. ఇది జరుగుతున్నప్పుడు మధ్యలోకి త్రిగుణ్ రావడంతో రోహిత్.. అతడికి గట్టిగానే ఇచ్చేశాడు.
నరేశ్, షాలినిలో గెలిచిన నరేశ్.. సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలినినే నామినేట్ చేశాడు. గేమ్ సీరియస్‌గా తీసుకున్నారు మీరు ఓడిపోతే తీసుకోలేరు. చైత్రని మీరు హర్ట్ చేసి తనతో గొడవపడి చివరకు తనతోనే క్షమాపణ చెప్పించారు. ఎప్పుడూ బిగ్‌బాస్ పిలిచిన వెంటనే రారు. మీకు ఇప్పుడే వార్నింగ్ కూడా వచ్చింది అని కారణాలు చెప్పాడు. షాలిని, త్రిగుణ్ పోటీలో త్రిగుణ్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తనని టార్గెట్ చేసిన సుధీర్‌ని నామినేట్ చేశాడు. ఏమైనా ఒప్పుకుంటా కానీ వెన్నుపోటు పొడిచావ్ అంటే తీసుకోలేను. నువ్వే వచ్చి నాది సృష్టిది హైట్ సరిపోతుంది అని నువ్వే నాతో మాట్లాడావ్ నేను ఎవరికీ ఈ విషయాలు చెప్పలేదు. తోముతున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు మీనింగ్‌తో అనలేదు. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు అని త్రిగుణ్ తన అభిప్రాయాల్ని చెప్పాడు.
చివరిగా నాతో ఫైట్ చేస్తే బాగా కనిపిస్తావ్ అని నాతో పెట్టుకున్నావ్ నాకు తెలుసు అని సుధీర్‌ని రివర్స్ ఎటాక్ చేశాడు త్రిగుణ్. త్రిగుణ్ తన రెండో నామినేషన్ రోహిత్‌కి వేశాడు. నువ్వేదీ తీసుకోవడం లేదు. పనిచేయవు పనిచేసే వాళ్లని చేయనివ్వడం లేదు అని త్రిగుణ్ తన కారణాలు చెప్పాడు. ఇదలా ఉండగానే మరోవైపు వర్షిణి, షాలిని గట్టిగా గొడవపడ్డారు. తర్వాత ముఖేశ్, అమన్ పోటీపడగా.. గెలిచిన అమన్ గోల్డ్ గొడ్డలి పట్టుకొని మొదట రాంప్రసాద్‌ని నామినేట్ చేశాడు. తర్వాత ఝాన్సీకి నామినేట్ చేసి మొదట నా గేమ్ బాగుంది అని చెప్పి అందరి దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావ్ అనడం నచ్చలేదు అని చెప్పాడు.
రాంప్రసాద్, వంశీలలో వంశీ గెలిచి గోల్డెన్ గొడ్డలి అందుకున్నాడు. వంశీ మొదటి దేబ్జానీని నామినేట్ చేశాడు . నువ్వు ఓ పదం వాడావు నాకు అది నచ్చలేదు ఆ పదం ఇప్పుడు కూడా నాకు మాట్లాడాలి అని లేదని అన్నాడు. ఈ పదం వాడకూడదు అని నాకు తెలీదు. మేం జిమ్‌లో వాడుతుంటాం. వర్షిణి ఆ పదం వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు తెలిసింది అని దేబ్జానీ సమాధానమిచ్చింది. రెండో నామినేషన్ ముఖేశ్‌కి వేశాడు. ముఖేశ్ ఇంట్లో గడ్డం గీసుకోవడం తనకి ఇబ్బందిగా అనిపించిందని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. నరేశ్, ముఖేశ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, ఝాన్సీ, అమన్, షాలిని, సృష్టి.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్.
ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే?
సుధీర్.. త్రిగుణ్, షాలిని
దేబ్జానీ.. త్రిగుణ్, రోహిత్
త్రిగుణ్, ఝాన్సీ
నరేష్.. షాలిని,
త్రిగుణ్.. సుధీర్, రోహిత్
అమన్.. రాం ప్రసాద్, ఝాన్సీ
వంశీ.. దేబ్జానీ, ముఖేష్
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా 'హుషార్ పిట్టలు')


