టాలీవుడ్ హీరోయిన్ సమంత ఈ ఏడాది గ్రాండ్ సక్సెస్ కొట్టింది. మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటితో పాటు ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.
సామ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.." మన సంప్రదాయాల పట్ల నాకు ఎల్లప్పుడూ ప్రగాఢమైన గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక మంత్ర ధ్వనిలో.. జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిలో..ప్రాచీన ఆచారాలు తరతరాలుగా జాగ్రత్తగా అందించబడిన విధానంలో ఏదో ఒక లోతైన శక్తి పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను" అని పోస్టు చేసింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ సీమంతం ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. సమంత గతేడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక కోయంబత్తూరులో జరిగింది.


