'ప్రతి విషయానికి అనుమానమే..'ఫుల్ కామెడీ ట‍్రైలర్ చూశారా? | Rag Mayur latest Movie Anumana Pakshi Trailer out now | Sakshi
Sakshi News home page

Anumana Pakshi Trailer: 'ప్రతి విషయానికి అనుమానమే..'ఫుల్ కామెడీ ట‍్రైలర్ చూశారా?

Sep 14 2026 6:07 PM | Updated on Sep 14 2026 6:57 PM

Rag Mayur latest Movie Anumana Pakshi Trailer out now

రాగ్‌ మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌ అనుమాన పక్షి.  ఈ చిత్రానికి  విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజీవ్‌ చిలక, రాజేశ్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ వినాయకచవితి సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే వ్యక్తి వల్ల అతనితో పాటు.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కోణంలోనే ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, రాశి, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement