సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని నటి రసికా దుగ్గల్ అన్నారు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమా రంగంలో అవకాశాలు ఎలా వస్తాయనే విషయంపై ఓ ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!
ఆ నటీనటులకు కూడా..
‘జీవితంలో కొన్నిసార్లు ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కళాత్మక ప్రతిభ కూడా అవవసరమవుతుంది. ఒక నటుడి పని పెరుగుతున్న కొద్దీ.. అతడిపై ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. నటుడు తమ ప్రాజెక్టుకు సరిపోతాడని భావించినప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. పని పెరుగుతున్నప్పుడు.. ఆ ప్రాజెక్టుకు సరిపోతారని వారు భావించినప్పుడు మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. మంచి గుర్తింపు వచ్చిన నటీనటులకు కూడా అవకాశాలు చేజారడం బాధ కలిగిస్తుంది’ అని రసికా చెప్పింది.
‘మిర్జాపూర్’తో గుర్తింపు
రసికా దుగ్గల్ ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్రియా పిల్గావోంకర్, కుల్‌భూషణ్ ఖర్బందా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇదీ చదవండి: ‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..


