breaking news
beena
-
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు: మిర్జాపుర్ నటి
సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని నటి రసికా దుగ్గల్ అన్నారు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమా రంగంలో అవకాశాలు ఎలా వస్తాయనే విషయంపై ఓ ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!ఆ నటీనటులకు కూడా..‘జీవితంలో కొన్నిసార్లు ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కళాత్మక ప్రతిభ కూడా అవవసరమవుతుంది. ఒక నటుడి పని పెరుగుతున్న కొద్దీ.. అతడిపై ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. నటుడు తమ ప్రాజెక్టుకు సరిపోతాడని భావించినప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. పని పెరుగుతున్నప్పుడు.. ఆ ప్రాజెక్టుకు సరిపోతారని వారు భావించినప్పుడు మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. మంచి గుర్తింపు వచ్చిన నటీనటులకు కూడా అవకాశాలు చేజారడం బాధ కలిగిస్తుంది’ అని రసికా చెప్పింది.‘మిర్జాపూర్’తో గుర్తింపురసికా దుగ్గల్ ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్రియా పిల్గావోంకర్, కుల్‌భూషణ్ ఖర్బందా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. -
'హేమను తెలిసిన వారే చంపేశారు'
ముంబై: ప్రముఖ ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ్‌ను ఎవరో ఆమెకు బాగా తెలిసినవారే హత్య చేసి ఉంటారని ఆమె తల్లి బీనా మనుభాయ్ హిరాని (72) అభిప్రాయపడ్డారు. హత్యకు గురవడానికి ముందురోజు తన కూతురు హేమ ఫోన్ చేసి.. తెలిసిన వారిని కలవడానికి వెళుతున్నాను, మర్నాడు మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పిందన్నారు. అయితే కూతురి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న తనకు ఆమె మరణవార్త తెలిసిందని బీనా మనుభాయ్ వాపోయారు. హేమ మృతివార్తను తాను నమ్మలేకుండా ఉన్నానని, తన ఆరోగ్యం పట్ల హేమ ఎంతో శ్రద్ధ తీసుకునేదని బీనా తెలిపారు. హేమ భర్త చింతన్ గానీ, ఆమెతో కలిసి పనిచేసిన విద్యాధర్ రాజ్‌భర్ గానీ హత్యకు పాల్పడినట్లు నమ్మకంగా చెప్పలేనంది. అయితే తన కూతుర్ని హత్య చేసినవారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించబడాలని ఆమె డిమాండ్‌చేశారు. హేమా, చింతన్ల మధ్య సుదీర్ఘ కాలంగా విభేదాలున్నాయని తెలిపింది. అయితే ఆ విభేదాలు తన కూతురు హత్యకు కారణం అవుతాయని ఊహించలేదని బీనా తెలిపిపారు.


