breaking news
Rasika Dugal
-
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు: మిర్జాపుర్ నటి
సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని నటి రసికా దుగ్గల్ అన్నారు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమా రంగంలో అవకాశాలు ఎలా వస్తాయనే విషయంపై ఓ ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!ఆ నటీనటులకు కూడా..‘జీవితంలో కొన్నిసార్లు ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కళాత్మక ప్రతిభ కూడా అవవసరమవుతుంది. ఒక నటుడి పని పెరుగుతున్న కొద్దీ.. అతడిపై ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. నటుడు తమ ప్రాజెక్టుకు సరిపోతాడని భావించినప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. పని పెరుగుతున్నప్పుడు.. ఆ ప్రాజెక్టుకు సరిపోతారని వారు భావించినప్పుడు మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. మంచి గుర్తింపు వచ్చిన నటీనటులకు కూడా అవకాశాలు చేజారడం బాధ కలిగిస్తుంది’ అని రసికా చెప్పింది.‘మిర్జాపూర్’తో గుర్తింపురసికా దుగ్గల్ ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్రియా పిల్గావోంకర్, కుల్‌భూషణ్ ఖర్బందా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. -
‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయా.. ఇక నావల్ల కాదు: నటి
ఏడ్చీఏడ్చీ అలిసిపోయా. ఇంకా ఏడుస్తూ ఉండటం తన వల్ల కాదంటోంది బాలీవుడ్ నటి రసిక దుగల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఏ స్క్రిప్ట్ అందుకున్నా చివర్లో కచ్చితంగా రెండు ఏడుపు సన్నివేశాలు రాసేవారు. అది పది పేజీల స్క్రిప్ట్ అయినా సరే.. ఏడుపు తప్పనిసరిగా ఉండేది.ఓటీటీల వల్లే..అలాంటి పాత్రల్లో పదే పదే నటించి బోర్ కొట్టేసింది. ఈ మధ్య దర్శకరచయితలు కాస్త రూటు మార్చారు. నాకంటూ కొత్త రోల్స్ ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఓటీటీల వల్లే ఇది సాధ్యమైంది. అంతకుముందు నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ మీర్జాపూర్ వంటి సిరీస్‌ల వల్ల మరింత పేరు సంపాదించుకున్నాను, ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాను. ఎంతోమంది ప్రేక్షకులను అలరించగలుగుతున్నాను. చిన్న చిత్రాలకు ఓటీటీలు బెస్ట్ ఛాయిస్.మీర్జాపూర్‌తో ఫేమస్కానీ ఇప్పుడు చిన్న చిత్రాలు ఓటీటీలోకి రావడం కూడా కష్టమైపోతోంది. అయితే కొత్తదనానికి, కొత్త టాలెంట్‌కు, కొత్త ఐడియాలకు మాత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్ మంచి వేదికగా మారింది అని చెప్పుకొచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించిన రసిక . శేఖర్ హోమ్ అనే షోలో భాగమైంది. ఈ షో ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటించిన లిటిల్ థామస్ చిత్రం ఆగస్టు 19న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్లో ప్రసారం కానుంది.చదవండి: అర్ధరాత్రి స్నానం, ఐదింటికి నిద్ర.. షారూఖ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! -
'మీర్జాపుర్ 3' అప్డేట్ ఇచ్చిన బీనా ఆంటీ!
Mirzapur Season 3: ఓటీటీల్లోని వెబ్ సిరీసులు అనగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది 'మీర్జాపుర్'. బూతులు ఎక్కువని అంటారు గానీ తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఈ సిరీస్‌కు ఫ్యాన్స్. మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా పాత్రలు వాళ్లు చెప్పిన డైలాగ్స్ మీలో చాలామందికి బాగా తెలుసు. వాళ్లందరూ కూడా మూడో సీజన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు బీనా అంటీ అప్డేట్ తో వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) మూడేళ్లుగా వెయిటింగ్ 2018లో 'మీర్జాపుర్' తొలి సీజన్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తొమ్మిది ఎపిసోడ్లలో ప్రతి ఒక్కటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. 2020లో 10 ఎపిసోడ్లతో రెండో సీజన్ వచ్చింది. దీనికి కూడా మొదటి దానికి మించిన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. చాలారోజుల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బీనా ఆంటీ డబ్బింగ్ ఈ సిరీస్ లో మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, ఖాలీన్ భయ్యా పాత్రల తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న రోల్ అంటే బీనా అంటీదే. ఈమెది ఖాలీన్ భయ్యాకు రెండో భార్య పాత్ర. ఒకటి, రెండు సీజన్లలో ఈమె పాత్రకు స్కోప్ తక్కువే. కానీ మూడో సీజన్ లో మాత్రం ఎక్కువే ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పోస్ట్ చేసి.. త్వరలోనే సీజన్ 3 రిలీజ్ అవుతుందనే హింట్ ఇచ్చేసింది. దీంతో 'మీర్జాపుర్' ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Rasika (@rasikadugal) (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)


