టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ జంటల్లో వీరిది ఒకటి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఇషా రెబ్బా గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా సార్లు ఈ జంట రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. గతంలో ఇషాతో రిలేషన్‌పై తరుణ్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువని స్పష్టం చేశారు. అనుకున్నట్లు జరిగితే గుడ్ న్యూస్ చెప్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు.
తాజాగా వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా పూజలు చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇవీ చూసిన కొందరు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజా ఫొటోతో వీరి రిలేషన్‌పై మరోసారి జోరుగా చర్చ మొదలైంది. కాగా.. ఈ ఏడాది వీరిద్దరు హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదలైంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్‌గా తెరకెక్కించారు.


