చిరు ఆర్డర్ చేసిన లాకెట్.. చరణ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు | Paradise Director Srikanth Odela Recalls Ram Charan Locket Gift | Sakshi
Sakshi News home page

Srikanth Odela: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా

Sep 15 2026 8:44 AM | Updated on Sep 15 2026 8:50 AM

Paradise Director Srikanth Odela Recalls Ram Charan Locket Gift

మెగాహీరో రామ్ చరణ్ కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అంటే అందరూ చెప్పే పేరు 'రంగస్థలం'. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ దగ్గర శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. తర్వాత కాలంలో 'దసరా'తో డైరెక్టర్ అయిన ఇతడు.. నానితో 'ప్యారడైజ్' తీశాడు. వచ్చేవారం ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రంగస్థలం' షూటింగ్ టైంలో చరణ్‌ని చాలా ఇబ్బంది పెట్టానని గుర్తుచేసుకున్నాడు. అప్పటి సంగతులు పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: టీజర్, పాటల దెబ్బ.. రిలీజ్‌కి ముందే నాని ‘ది ప్యారడైజ్’ రికార్డు)

శ్రీకాంత్ ఓదెల, 'ప్యారడైజ్'లో విలన్‌గా చేసిన హిందీ నటుడు రాఘవ్ జుయెల్ సరదాగా కారులో తిరుగుతూ మాట్లాడుకున్నారు. ఇందులో శ్రీకాంత్ మెడలోని హనుమంతుడి లాకెట్ గురించి ప్రస్తావన వచ్చింది. 'ఈ లాకెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే చిరంజీవి స్వయంగా చెన్నై వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి రెండే పీసులు తయారు చేయించారు. అందులో ఒకటి చిరంజీవి దగ్గరుంటే రెండోది 'రంగస్థలం' మూవీలో చరణ్ అన్న ధరించారు. ఈ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశా'

'కాస్ట్యూమ్స్ విషయంలో చరణ్ అన్నని చాలా టార్చర్ పెట్టేవాడిని. తెల్లవారుజామున 3:30, 4 గంటలకే నిద్రలేపి ఆ కాస్ట్యూమ్ ఏది? ఈ లుక్ సరిగ్గా ఉందా? అని పరుగులు పెట్టించాను. షూటింగ్ చివరిరోజున చరణ్ అన్న నన్ను కారవాన్‌లోకి పిలిచారు. సాధారణంగా ఆయన ఎవరినీ అనవసరంగా పిలవరు. నేను కారవాన్‌లోకి వెళ్లగానే ఏం మాట్లాడకుండా ఈ లాకెట్‌ తీసి నా చేతిలో పెట్టారు. 'శ్రీకాంత్.. ఇది నీ దగ్గరే ఉంచుకో' అని చెప్పారు' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

'ఆ సమయంలో చరణ్‌ అన్నని ఇదెందుకు ఇస్తున్నారని ఒక్క ప్రశ్న అడగలేదు. అప్పుడు తీసుకున్న ఆ లాకెట్‌ ఇప్పటి వరకు నా మెడలోంచి తీయలేదు. రీసెంట్‌గా రామ్ చరణ్‌ని కలిసినప్పుడు “అన్నా.. ఈ లాకెట్ గుర్తుందా?” అని అడిగితే.. ఒక్కక్షణం ఆలోచించి అప్పటి సంగతి గుర్తుచేసుకున్నారు. “అవును కదా.. నేనే నీకు ఇచ్చాను” అని సంతోషపడ్డారు' అని శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement