'ఆహా కళ్యాణం' వెబ్ సిరీస్‌లో పవి టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి బ్రిగిడా సాగా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు ఆనంద్ రామ్‌తో కొత్త జీవితం ప్రారంభించింది. వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ మేరకు కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
(ఇదీ చదవండి: శుభవార్త చెప్పేసిన రష్మిక ఫ్రెండ్-సీరియల్ హీరోయిన్)
బ్రిగిడా సాగా సొంత భాష తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. తమిళ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్‌గా వైరల్ అయిపోయిన ఈమె.. 2019లో వచ్చిన తమిళ మూవీ 'అయోగ్య'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్‌స్పాట్ టూ మచ్ తదితర చిత్రాలు చేసింది. తెలుగులో సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది.
ఈ ఏడాది జూన్‌లో తన ప్రేమ సంగతి బయటపెట్టింది. జూలైలో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేసింది. ఈమెని పెళ్లాడిన ఆనంద్ రామ్ కూడా నటుడే. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. ఓ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాడు.
(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్‌లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)




