శుభవార్త చెప్పేసిన రష్మిక ఫ్రెండ్-సీరియల్ హీరోయిన్ | Actress And Bigg Boss 8 Fame Prerana Kambam Announce Pregnancy | Sakshi
Sakshi News home page

Prerana Kambam: తల్లి కాబోతున్న బిగ్‌బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్

Sep 15 2026 3:13 PM | Updated on Sep 15 2026 3:20 PM

Actress And Bigg Boss 8 Fame Prerana Kambam Announce Pregnancy

వినాయక చవితి సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో జరిగిన పండగ ఫొటోలని పంచుకున్నారు. ఇదే టైంలో హీరోయిన్ రష్మిక స్నేహితురాలు, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ ప్రేరణ మాత్రం తాను తల్లి కాబోతున్న విషయాన్ని పంచుకుంది. భర్తతో కలిసి బేబి బంప్ చూపిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్‌లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)

స్వతహాగా కన్నడ అయిన ప్రేరణ.. నటి అయ్యే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రష్మికకు స్నేహితురాలు. తర్వాత కాలంలో రష్మిక హీరోయిన్ అయిపోగా.. ప్రేరణ సీరియల్ హీరోయిన్‌గా మారింది. 'కృష్ణ ముకుంద మురారీ' అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తర్వాత బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో పాల్గొంది. ఫినాలే వరకు వచ్చినప్పటికీ టాప్-4లో మాత్రమే చోటు దక్కించుకుంది. విజేత కాలేకపోయింది.

'బిగ్ బాస్'లో కప్పు గెలుచుకోలేకపోయింది గానీ తర్వాత తన భర్త శ్రీపాద్‌తో కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన 'ఇస్మార్ట్ జోడీ 3' రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 నవంబరులో వీళ్లిద్దరికీ పెళ్లి కాగా ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తని బయటపెట్టారు. బేబీ బంప్ వీడియోని పంచుకున్నారు. ఈ క్రమంలోనే యష్మి గౌడ, రోహిణి తదితరులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'పవి టీచర్'.. ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement