బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనను రాజు లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి మీయాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రాజుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే..తాజాగా రాజుకు, కేసు పెట్టిన యువతికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినదిగా చెబుతున్న ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో గొడవ.. స్పందించిన దర్శకుడు)
ఆడియోలో రాజు... ఇప్పటి నుంచి కేవలం స్నేహితుడిగానే ఉంటానని చెబుతున్నాడు. ప్లీజ్ శిరీష వద్దు.. తనను వదిలేసేందుకు రూ.5 లక్షలు ఇస్తానని అంటున్నాడు. అందుకు నిరాకరించిన యువతి.. తనతోనే ఉంటే కష్టం అనేది రాకుండా చూసుకుంటానని చెబుతోంది. వేరే అమ్మాయి కోసమే తనను వదిలేస్తున్నావా..? అంటూ రాజును యవతి నిలదీసింది. కానీ ఎవరితో తాను తిరగడంలేదని ఈ రిలేషన్ షిప్ వద్దని రాజు కోరారు.
అయినప్పటికీ తనతోనే ఉండాలని యవతి కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే రాజు మాత్రం తనను ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూశానని.. ప్రేమ, పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాడు. అంతేకాదు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. తనతో మాత్రం రోజుకు ఒకసారి కలుస్తానని అంటున్నాడు. చివరికి రూ.5 లక్షలు ఇచ్చి వెళ్లిపోపోవచ్చని, ఫ్రెండ్ లా ఉండాలన్నా మరో యువతిని నీ పక్కన చూస్తూ ఉండలేనంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆడియోలో ఉన్న వాయిస్ నిజంగా రాజుదేనా లేదా ఫేక్ ఆడియోనా అనేది తెలియాల్సి ఉంది.
ఢీ షో విజేత రాజు ఆడియో కాల్
నేను వేరే పెళ్లి చేసుకుంటా.. ఫ్రెండ్‌గా ఉంటా.. రెండు రోజులకు ఒకసారి అయినా కలుస్తా...
నీ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇస్తాను.. నన్ను వదిలేయ్ వేడుకున్న రాజు
నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. నీతో వేరే అమ్మాయిని ఊహించుకోలేను అంటూ వేడుకున్న యువతి pic.twitter.com/UwoZXr8dTO— greatandhra (@greatandhranews) September 15, 2026


