వయోపరిమితిపై స్పష్టత ఇవ్వని సర్కార్
తెలంగాణలో వయోపరిమితి సడలింపు
ఏపీలో కూడా సవరించాలని డిమాండ్
జాబ్ క్యాలెండర్‌కు ముందే తేల్చాలని నిరుద్యోగుల డిమాండ్
సాక్షి,అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చతికిల పడింది. ఏటేటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలిస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. ఇక డీఎస్సీ–2025 అక్రమాలకు అడ్డాగా మారింది.స్పోర్ట్స్ డీఎస్సీలో ప్రతిభ ఉన్న వారిని పక్కనపెట్టి దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి టీచర్ ఉద్యోగాలిచ్చేసింది. దీంతో నిరుద్యోగుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లు పారదర్శకంగా ఉండాలని.. ప్రధానంగా వయో పరిమితిపై స్పష్టత ఇవ్వాలని యువత డిమాండ్ చేస్తోంది.
నోటిఫికేషన్‌కు ముందే స్పష్టత ఇవ్వాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో భాగంగా సెపె్టంబర్ 15న విడుదల చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ముందే వయోపరిమితిపై క్లారిటీ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా నిరుద్యోగుల ప్రధాన సమస్య అయిన వయోపరిమితి పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నోటిఫికేషన్లు ఆలస్యం.. పెరుగుతున్న ఆందోళన..
ప్రభుత్వం నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్‌లు, రూమ్‌ల కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి ఉద్యోగాల నోటిఫికేష్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వయోపరిమితి దాటిపోయి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్ప
డింది. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు కోసం నిరీక్షిస్తున్నారు. అయినా సర్కారు దయ చూపడం లేదు.
నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..
47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలి
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న 42 సంవత్సరాల గరిçష్ట వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగుల వయోపరిమితి సమస్యపై స్పందించి 44 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా 47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరఫున వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలని నిరుద్యోగులు హితవు పలుకుతున్నారు.
టెన్షన్‌లో పోలీస్ అభ్యర్థులు..: 2022లో చివరిసారిగా పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ రాకపోవడంతో అనేకమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ తదితర యూనిఫాం సర్వీసుల అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలి.
ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్లు.. డీఎస్పీకి 30 ఏళ్లే...: యూపీఎస్‌సీ ద్వారా భర్తీ చేసే ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్ల వయోపరిమితి ఉంది. అయితే
రాష్ట్రస్థాయిలో ఏపీపీఎస్‌సీ గ్రూప్–1 ద్వారా భర్తీ చేసే డీఎస్పీ పోస్టుకు 30 సంవత్సరాలే ఉందని.. ఈ అంశంపై పునఃపరిశీలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేకమంది ప్రతిభావంతులైన అభ్యర్థులు వయోపరిమితి కారణంగా డీఎస్పీ పోస్టుకు దూరమవుతున్నారు. ఐపీఎస్‌కు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు డీఎస్పీకి 30 సంవత్సరాల పరిమితి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యత్యాసంపైనా ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ పోస్టుకు వయో పరిమితి 32 ఏళ్లకు పెంచాలని అడుగుతున్నారు.
తెలంగాణలో సడలింపు..: నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి సడలింపులు కల్పించింది. పొరుగు రాష్ట్రంలో నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ తమ డిమాండ్‌ను నెరవేర్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


