సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శేషయ్యగారిపల్లి వద్ద బస్సు వెనుక టైర్ కింద పడి గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు కడపలోని లోహియా నగర్‌కు చెందినవారిగా తెలుస్తోంది. అదే ప్రమాదంలో కానూరు మనోహర్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో శేషయ్యగారిపల్లి వద్ద విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు


