రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు | YS Jagan Greets People on the Occasion of Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

Sep 13 2026 4:12 PM | Updated on Sep 13 2026 4:39 PM

YS Jagan Greets People on the Occasion of Vinayaka Chavithi

సాక్షి,తాడేపల్లి: రేపు(సోమవారం, సెప్టెంబర్‌ 14వ తేదీ) వినాయక చవితి పర్వదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.  

ఏ కార్యం తలపెట్టినా మహాగణనాధుడిని ముందుగా పూజిస్తామని, అలా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోతాయని గుర్తు చేశారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement