సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో ఒంటరి మహిళ రియాజున్నీసా (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి బయట తాళం వేసి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి భర్త రహమతుల్లా రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ రెండేళ్ల క్రితం మరణించారు. పిల్లలు లేకపోవడంతో మృతురాలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో..
భార్య తో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా డు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. పింజరి నబీసా (37) మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భార్య పింజరి మాబీతో గొడవ జరిగింది.
క్షణికావేశంలో ఆయన ఇంట్లోని పైకప్పు కర్రకు చీరతో ఉరి వేసుకుని వేలాడుతుండగా కుటుంబ సభ్యులు గమనించి కిందకు దించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు క్యాజువాలిటీ వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి..!


