పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan expressed deep condolences over the death of four people | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో నలుగురి మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Sep 13 2026 9:05 PM | Updated on Sep 13 2026 9:54 PM

YS Jagan expressed deep condolences over the death of four people

సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాల్లో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పండుగ వేళ నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం తనను కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement